ముందు ఈడ సక్కదిద్దు: రాష్ట్ర సర్కారుపై మండిపడ్డ రైతు

ముందు ఈడ సక్కదిద్దు: రాష్ట్ర సర్కారుపై మండిపడ్డ రైతు

గన్నేరువారం, వెలుగు: రెండు నెలలు గడుస్తున్నా సన్న వడ్లకు మద్దతు ధర ప్రకటించలేదని, కనీసం కొనేటోళ్లు లేరంటూ రాష్ట్ర సర్కారు వైఫల్యాన్ని ప్రశ్నించిన ఓ రైతు వీడియో సోషల్​మీడియాలో వైరలైంది. కరీంనగర్​జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామానికి చెందిన రైతు తిరుపతి సన్న వడ్లు కొనకుండా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కేంద్ర తప్పు చేసిందంటూ బంద్​కు మద్దతు పలికిన రాష్ట్ర సర్కారు ఇక్కడి రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు.

ముందు మన ఇల్లు సక్కదిద్దుకున్నంక బయటోళ్ల గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్​వ్యవసాయం చేస్తే రైతు కష్టాలు తెలిసేవని అన్నారు. కేంద్రం ఎంఎస్పీ రేటు ప్రకటించలేదని సాకులు చెప్పడం కాదని, క్వింటాలుకు ఇంత ఇస్తామని చెప్పాలని.. లేదా రాష్ట్ర సర్కారు కొనుగోలు చేయదని ప్రకటించాలని డిమాండ్​ చేశారు. ముందు రాష్ట్రాన్ని సక్కదిద్దుకుని తర్వాత కేంద్రంపై దండెత్తాలన్నారు. సన్నొడ్లకు ముందు రూ. 2,500 ఇవ్వాలన్నారు. అప్పుడే రైతులు కేసీఆర్​కు మద్దతు పలుకుతారన్నారు.