అప్పుల బాధతో రైతు ఆత్మహత్య...వరంగల్ జిల్లా గీసుగొండలో ఘటన

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య...వరంగల్ జిల్లా గీసుగొండలో ఘటన

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: అప్పుల బాధతో వరంగల్​ జిల్లా గీసుగొండలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విశ్వేశ్వర్​ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాపర్తి రమేశ్(45) తన 20 గుంటల భూమితో పాటు మరో 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగా పండకపోవడం, పెట్టుబడులు రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. వేధింపులు తీవ్రం కావడంతో సోమవారం పొలంలో గడ్డి మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడికి భార్య సుమలత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.