రైతు బిడ్డకు డాక్టరేట్..ఓయూ నుంచి అందుకున్న కొర్వి బాలకృష్ణ

రైతు బిడ్డకు డాక్టరేట్..ఓయూ నుంచి అందుకున్న కొర్వి బాలకృష్ణ

ఓయూ, వెలుగు: రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు బిడ్డకు డాక్టరేట్ వరించింది. కందుకూరు మండలం గూడూరుకు చెందిన రైతు కొర్వి నరసింహ, స్వరూప దంపతులు. వీరి కొడుకు బాలకృష్ణకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గురువారం డాక్టరేట్ అందుకున్నాడు. ఓయూ ఇంగ్లీష్ విభాగంలో ‘ఎన్​హెన్సింగ్ సాఫ్ట్ స్కిల్స్ త్రూ లిటరేచర్ అమాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై ప్రొ.కొండా నాగేశ్వర్ రావు పర్యవేక్షణలో ఆయన రీసెర్చ్ చేశారు. 

ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం నేతృత్వంలో ఉద్యమ నాయకుడిగా ఓయూ జేఏసీలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సైకాలజీ, ఆ తర్వాత ఇఫ్లూ వర్సిటీ నుంచి ఎంకామ్, ఎంఈడీ చదివారు. నిరుద్యోగులు, సామాన్య ప్రజల కోసం న్యాయ పోరాటాలు కొనసాగించాడు. బాలకృష్ణకు డాక్టర్ లభించడంపై ఓయూ అధ్యాపకులు, విద్యార్థి నాయకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.