పట్టాభూమిని పాస్​బుక్​లో ఎక్కించడం లేదని ఏం చేశాడంటే..

పట్టాభూమిని పాస్​బుక్​లో ఎక్కించడం లేదని ఏం చేశాడంటే..
  • అధికారులు, సిబ్బందిపై తిట్ల దండకం
  • టేబుల్ పై కూర్చుని తాహసీల్దార్ పై బూతులు
  • ఆపై ఘర్షణకు దిగితే.. అడ్డుకున్న కానిస్టేబుల్​పై కూడా దాడి

లింగంపేట,(కామారెడ్డి జిల్లా) వెలుగు: ‘ఏడాది కాలంగా రెవెన్యూ ఆఫీస్​చుట్టూ తిరుగుతున్నా పట్టా భూమిని ఎందుకు పాస్ బుక్​లో ఎక్కించడం లేదు. గవర్నమెంట్​నుంచి జీతం తీసుకుంటూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తారా..’ అంటూ రైతు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన తోట సంగమేశ్వర్​కు చెందిన ఏడుంపావు గుంటల పట్టా భూమి పాసుబుక్​లో నమోదు కాలేదు. భూమిని పాసుబుక్​లో నమోదు చేయాలని పలుసార్లు తహసీల్దార్​ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు.

రెవెన్యూ ఆఫీసర్లు స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చాడు. కలెక్టర్​ను వేడుకున్నా పని కాకపోవడంతో బుధవారం సంగమేశ్వర్​ఫుల్​గా మద్యం తాగి తహసీల్దార్​చాంబర్​లోకి ప్రవేశించాడు. టేబుల్​పై కూర్చుని తహసీల్దార్​ మారుతిని బూతులు తిడుతూ ఘర్షణ పడ్డాడు. తహసీల్దార్​ పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుళ్లు రమేశ్, రాజు అక్కడకు చేరుకున్నారు. కానిస్టేబుల్​రమేశ్, వీఆర్ఏలు దత్తు, సురేశ్​కలిసి సంగమేశ్వర్​ను ఆఫీస్​నుంచి బయటకు నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో సంగమేశ్వర్​ఆగ్రహంతో  కానిస్టేబుల్​పై  దాడి చేశాడు. తహసీల్దార్​ మారుతి ఫిర్యాదు మేరకు సంగమేశ్వర్​పై  కేసు నమోదుచేసినట్లు ఎస్సై శంకర్​చెప్పారు.