ఆదిలాబాద్లోని సోయా కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

ఆదిలాబాద్లోని సోయా కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
  •      బోథ్​లో మూడు గంటల పాటు రాస్తారోకో

బోథ్, వెలుగు: ప్రభుత్వం సోయా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ ఆదిలాబాద్​తో పాటు​ బోథ్ లో రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్​లోని మార్కెట్​యార్డుల ముందు ధర్నా చేశారు. వారికి మాజీ జడ్పీ చైర్మన్ ​సుహాసినీరెడ్డి, బీఆర్ఎస్​ నాయకులు, రైతు సంఘాలు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. 

బోథ్​ మండల కేంద్రంలోని కోరమాండల్​ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ధర్నా చేశారు. కొనుగోల్లు ప్రారంభించే వరకు ధర్నా ఆపేది లేదని పట్టుబట్టారు.  తహసీల్దార్​ సుభాష్, ఎస్సై శ్రీసాయిలు అక్కడికి చేరుకొని అడిషనల్​కలెక్టర్ ​శ్యామలాదేవితో మాట్లాడించి కొనుగోల్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 3 గంటల పాటు ధర్నా చేయడంతో మార్కెట్ యార్డు ముందు భారీగా ట్రాఫిక్​ జామ్ అయ్యింది. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.