మంచిర్యాల జిల్లాలో ఎస్సైల ట్రాన్స్ఫర్

మంచిర్యాల జిల్లాలో ఎస్సైల ట్రాన్స్ఫర్

కోల్​బెల్ట్, వెలుగు: కాళేశ్వరం జోన్​-1 పరిధిలోని పలువురు ఎస్సైలను బదిలీలు చేస్తూ మంగళవారం రామగుండం సీపీ అంబర్​ కిశోర్​ ఝూ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్​ ఎస్సై జి.రాజశేఖర్​ను రామగుండం సీసీఆర్​బీకి, గోదావరిఖని టౌన్​-1 ఎస్సై ఎల్.భూమేశ్​ను రామకృష్ణాపూర్​కు, హాజీపూర్​ఎస్సై ఎన్.స్వరూప్​రాజ్​ను రామగుండం పీసీఆర్​కు, తాండూర్​ ఎస్సై డి.కిరణ్​కుమార్​ను హాజీపూర్​ పోలీస్ ​స్టేషన్​కు బదిలీ చేశారు. 

నస్పూర్​ సీసీసీ ఎస్సై యు.ఉపేందర్​రావును రామగుండం టాస్క్​ఫోర్స్​కు, రామగుండం కమిషనరేట్ ​వీఆర్​లో ఉన్న ఎన్.సుగుణాకర్​ను ఆసిఫాబాద్​ వీఆర్​కు, ఆసిఫాబాద్​ సీసీఎస్​ నుంచి ఎస్సై ఎం.ప్రశాంత్​ను నస్పూర్​ సీసీసీ పోలీస్ స్టేషన్​కు ట్రాన్స్​ఫర్ ​చేశారు.

బాధ్యతలు తీసుకున్న రామకృష్ణాపూర్​ఎస్సై

రామకృష్ణాపూర్​ఎస్సై‌‌గా ఎల్.భూమేశ్​ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని, పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని తెలిపారు. స్టేషన్​సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు.