రాష్ట్రానికి మరో 7 స్వచ్ఛ అవార్డులు

రాష్ట్రానికి మరో 7 స్వచ్ఛ అవార్డులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలోని మరికొన్ని మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ కేటగిరీలో 7 మున్సిపాలిటీలకు కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవార్డులు ప్రకటించింది. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనగామ, ఆమనగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట మున్సిపాలిటీలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. 

2021 జులై నుంచి 2022 జనవరి వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా 4,355 పట్టణాల్లో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే నిర్వహించింది. పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ సహా 90 అంశాల్లో పనితీరు ఆధారంగా అవార్డులకు ఎంపిక చేశారు. గతంలో రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డులు వచ్చాయి. దీంతో మొత్తం 26 మున్సిపాలిటీలకు అవార్డులు దక్కినట్లయింది. తాజాగా అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షం వ్యక్తం చేశారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.