చెట్టు కొట్టేసినందుకు రూ.10 వేల ఫైన్

చెట్టు కొట్టేసినందుకు రూ.10 వేల ఫైన్

శంషాబాద్, వెలుగు: చెట్టును కొట్టేయించిన ఇంటి ఓనర్ కు బండ్లగూడ మున్సిపాలిటీ అధికారులు జరిమానా విధించారు. బండ్లగూడ గ్రామంలో ఉండే ప్రదీప్ సింగ్ తన ఇంటికి అడ్డుగా ఉందనే సాకుతో శుక్రవారం చెట్టుకు కొట్టేయించాడు.  దీంతో బండ్లగూడ మున్సిపాలిటీ అధికారులు ప్రదీప్ సింగ్ కు రూ.10 వేల ఫైన్ వేశారు. అదే విధంగా మెయిన్ రోడ్డుపై డ్రైనేజీ నీటిని వదిలినందుకు ఇద్దరికి రూ.1500 చొప్పున ఫైన్ విధించారు.