
తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విరుదునగర్ జిల్లాలో ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సత్తూరు సమీపంలో ఉన్న ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.