కోల్‌కతా ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

కోల్‌కతా ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం (జూన్ 14న) అగ్నిప్రమాదం జరిగింది. చెక్‌ ఇన్‌ వద్ద సెక్యూరిటీ ఉండే ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు ఎయిర్ పోర్టులో డిపార్చర్ టర్మినల్ కు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

3సి టెర్మినల్ భవనంలో సెక్యూరిటీ చెక్ ఏరియా సమీపంలో రాత్రి 9.20 గంటలకు మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. ఫైరింజన్ సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. 

విమానాశ్రయం లోపల మంటలు చెలరేగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.