రన్నింగ్ బీఎండబ్ల్యూ కారులో మంటలు.. ఎందుకీలా జరిగింది..?

రన్నింగ్ బీఎండబ్ల్యూ కారులో మంటలు.. ఎందుకీలా జరిగింది..?

హైదరాబాద్ మింట్ కాంపౌండ్ ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే కారును ఆపి.. బయటకు వచ్చారు. అందరూ చూస్తుండగానే ఆ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. 

విషయం తెలియగానే వెంటనే సంఘటన స్థలానికి జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్ చేరుకుంది. ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. ఫిర్యాదు అందగానే ఖైరతాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిపోయిన బీఎండబ్ల్యూ కారును పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని.. డ్రైవర్ తో పాటు అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

చాలామంది ఎండాకాలంలోనే కార్లలో మంటలు వచ్చి కాలిపోతాయని భావిస్తుంటారు. దీనికి కాలంతో సంబంధం లేదని ఈ ఘటన రుజువైంది. ఏ కాలమైనా.. కారు ఇంజిన్ లో లేదంటే వాహనంలోనే ఏదైనా సమస్య ఉంటే మంటలు వస్తాయంటున్నారు నిపుణులు.