
రామాయంపేట, వెలుగు : రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఒకరిని ఫైర్ సిబ్బంది కాపాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి పాడుపడిన బావిలో పడ్డాడన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకుని అతడిని బయటకు తీశామన్నారు.
కాగా ఆ వ్యక్తి హైదరాబాద్ ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన నిరంజన్గా తెలిసింది. అతడికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రామాయంపేట ఆస్పత్రికి తరలించారు.