న్యూఢిల్లీ: వెస్ట్ బెంగాల్లో నాలుగేండ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ బారినపడింది. చిన్నారికి హెచ్9ఎన్2 వైరస్ సోకినట్టు డబ్ల్యూహెచ్వో మంగళవారం వెల్లడించింది. మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం ఇండియాలో ఇది రెండో సారి అని తెలిపింది. 2019లో ఫస్ట్ కేసు నమోదైనట్టు డబ్ల్యూహెచ్వో వివరించింది. ఫిబ్రవరిలో చిన్నారి అనారోగ్యం బారినపడటంతో ఆమెను కుటుంబ సభ్యులను హాస్పిటల్లో చేర్పించారు.
మూడు నెలల పాటు చికిత్స అందించి కొన్ని రోజుల కిందే డాక్టర్లు డిశ్చార్జ్ చేశారని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఎక్కడా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసు రిజిస్టర్ కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. మాల్దా జిల్లాకు చెం దిన నాలుగేండ్ల చిన్నారికి జనవరిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని, తర్వాత ఆమె కోలుకున్నదని తెలిపారు.