లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అడిగి చైన్ స్నాచింగ్

లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అడిగి చైన్ స్నాచింగ్
  • ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ పేరుతో చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తిని నార్త్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ పోలీసులు  అరెస్ట్ చేశారు.  వీరి నుంచి 40 గ్రాముల గోల్డ్‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌,ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూర్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్ హల్లి రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన అంజుమ్‌‌‌‌‌‌‌‌(39) ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. స్థానికంగా ఉండే బసవరాజు(25)తో కలిసి ఈజీమనీకి ప్లాన్ చేసింది. రాత్రి పూట బైక్స్,కార్లలో ట్రావెల్‌‌‌‌‌‌‌‌ చేసే వారిని టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసింది. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అడిగి వారి ఒంటిపై ఉన్న చైన్స్,క్యాష్‌‌‌‌‌‌‌‌,విలువైన వస్తువులతో ఎస్కేప్ అయ్యేది. ఈ నెల12న బసవరాజుతో కలిసి అంజుమ్ సిటీకి వచ్చింది. అదే రోజు రాత్రి 7 గంటలకు అంజుమ్‌‌‌‌‌‌‌‌ ప్యారడైస్  సమీపంలోని ఆనంద్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చి కారులో వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అడిగింది. కొద్ది దూరం వెళ్లగానే కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో అతడు సీటీవో జంక్షన్ సమీపంలో కారు ఆపి ఆమెను దిగిపోవాలని చెప్పాడు. అంజుమ్ వెంటనే అతడి మెడలోని గోల్డ్‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌, ల్యాప్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ లాక్కుని పారిపోయింది. అక్కడి నుంచి ఆమె 
పంజాగుట్టకు వచ్చింది. బైక్‌‌‌‌‌‌‌‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అడిగింది. అతడితో అసభ్యంగా ప్రవర్తించి క్యాష్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసింది. అతడి మెడలోని గోల్డ్‌‌‌‌‌‌‌‌ చైన్ లాక్కుని పారిపోయింది. ఈ రెండు ఘటనల్లో బాధితులు మహంకాళి, పంజాగుట్ట పీఎస్​లో కంప్లయింట్ చేశారు. నార్త్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ కె. నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు టీమ్‌‌‌‌‌‌‌‌ కేసు దర్యాప్తు చేసింది. ప్యారడైజ్‌‌‌‌‌‌‌‌, పంజాగుట్టలోని సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌‌‌‌‌ పరిశీలించింది. శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అంజుమ్ తో పాటు అతడికి సహకరిస్తున్న బస్వరాజును అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.