
హైదరాబాద్ మలక్ పేట్ ఏరియా హాస్పిటల్ ముందు ఉన్న సోహెల్ హోటల్ వంటగదిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎమ్మెల్యే బలాల తెలిపారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో మలక్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు ఆందోళనకు గురయ్యారు. హోటల్ లో ఉన్న వ్యక్తులు ప్రాణాలను దక్కించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.
సోహెల్ హోటల్ నుంచి దట్టమైన పొగ రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందోనని అయోమయానికి గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..