హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేయడానికి ముస్సోరీలో ట్రైనింగ్ పొందుతున్న హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన 16 మంది ఐఏఎస్ లు రెండు రోజుల పర్యటనలోశుక్రవారం జీహెచ్ఎంసీని సందర్శించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్.. జీహెచ్ఎంసీ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రైనీ ఐఏఎస్ లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఈఎన్సీ జియాఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, డాక్టర్ సునంద, వెటర్నరీ డీడీ డాక్టర్ విల్సన్, ఎస్ డబ్ల్యూఎం ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
