హైదరాబాద్, వెలుగు: హెచ్ఐవీ చికిత్సలో వాడే లెనాకాపివిర్ అనే డ్రగ్‌ను అనేక పేద దేశాల్లో తయారు చేసి అమ్మడానికి హైదరాబాద్‌కు చెందిన హెటెరో ఫార్మా, గిలియడ్ సైన్సెస్ అనే పెద్ద విదేశీ ఫార్మా కంపెనీతో జతకట్టింది. లెనాకాపివిర్ చాలా విధాలుగా వైరస్‌తో పోరాడగల సూపర్ మెడిసిన్ లాంటిదని రెండు సంస్థలు ప్రకటించాయి.
పేద దేశాలలో ఎక్కువ మంది ప్రజలు తక్కువ ధరకే దీనిని పొందగలరని తెలిపాయి. మరింత మంది హెచ్‌ఐవి బారిన పడకుండా ఆపడానికి కూడా ఈ మందు సహాయపడుతుంది. డాక్టర్ రెడ్డీస్ కూడా గిలియన్తో లెనాకాపివిర్ తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది.