భారీ భూకంపం..పరుగులు తీసిన జనం

భారీ భూకంపం..పరుగులు తీసిన జనం

ఇండోనేషియాలోని తనింబల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 గా తీవ్రతగా నమోదైంది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 97 కిలోమీటర్ల లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. అటు భూకంపంతో  ఇండోనేషియా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. భూకంపంతో తూర్పు ఇండోనేషియాలోని పెద్ద భవనాలు దెబ్బతిన్నాయి.

మరోవైపు ఉత్తర ఆస్ట్రేలియాలోనూ భూప్రకంపనలు వచ్చాయి. డార్విన్ నగరంతో సహా ఉత్తర ఆస్ట్రేలియాలో వెయ్యికి పైగామంది  భూకంపం అనుభూతి చెందినట్లు జియోసైన్స్ ఆస్ట్రేలియా వెల్లడించింది.  భూ ప్రకంపనలతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం ద్వారా సునామీ ముప్పు లేదని పేర్కొంది.