టర్కీలో భారీ భూకంపం

టర్కీలో భారీ భూకంపం

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై  భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప ధాటికి పదుల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. భూకంపం వల్ల 150 మంది మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

తెల్లవారు జామున 4 గంటల సమయంలో  టర్నీలో భూమి కంపించింది. టర్కీకి ఆగ్నేయంగా ఉన్న నర్దాగిలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే వెల్లడించింది. నర్దాగీకి 26 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు ప్రకటించింది. భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు గుర్తించింది. అటు టర్కీతోపాటూ సిరియా, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సైప్రస్ లోనూ భూమి కంపించింది.