ఎల్బీనగర్ లోని కారు గ్యారేజ్ లో భారీ అగ్నిప్రమాదం

ఎల్బీనగర్ లోని కారు గ్యారేజ్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ : ఎల్బీనగర్ లోని CAR -O-MAN యువర్ కార్ సేవియర్ అనే గ్యారేజ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు. 

ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలో గ్యారేజ్ లోని రెండు సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

20కి పైగా సెకండ్ హ్యాండ్ కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం నాలుగు ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేమెంట్ ఫోర్స్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు.