శ్రీకాళహస్తి అడవుల్లో మంటలు

శ్రీకాళహస్తి అడవుల్లో మంటలు


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి సమీపంలోని కైలాసగిరుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై శ్రీకాళహస్తీశ్వర హరిత అభివృద్ధి సిబ్బంది స్పందించలేదని తెలుస్తోంది. 26 మంది సిబ్బందికిగాను నలుగురు మాత్రమే మంటలను ఆర్పేందుకు అందుబాటులో ఉన్నారని చెబుతున్నారు. అందుబాటులో లేని సిబ్బంది పట్ల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతామని చైర్మన్ చెబుతున్నారు. నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి ఫైర్ స్టేషన్ల నుండి ఫైరింజలను తెప్పిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే. 

అగ్ని ప్రమాదానికి ఎండిపోయిన వృక్ష సంపద కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దాదాపు ఒకటిన్నర కిలో మీటర్ల మేర మంటలు విస్తరించి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గోశాల వైపు మంటలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆకతాయిల కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.