ప్రాణం తీసిన ఆర్థిక కష్టాలు..ఉరేసుకుని భర్త సూసైడ్

ప్రాణం తీసిన ఆర్థిక కష్టాలు..ఉరేసుకుని భర్త సూసైడ్
  • ఒంటరైన భార్య, ముగ్గురు పిల్లలు .. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘటన

తంగళ్లపల్లి, వెలుగు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.  స్థానికులు, బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం.. వరంగల్ కు చెందిన తాడూరి రామ్ కుమార్(38) పద్నాగేళ్ల కింద రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ కు చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటుండగా.. దంపతులకు ముగ్గురు కొడుకులు సుజిత్(11), శ్రీవాస్తవ్ (5), విహాన్(1) ఉన్నారు. 

రామ్ కుమార్ సిరిసిల్లలో జిరాక్స్ మెషిన్ మెకానిక్ గా పని చేస్తూ.. బావమరిదితో వెడ్డింగ్ ఈవెంట్ పనులకు వెళ్లేవాడు. భార్య కాన్పులకు, వైద్య ఖర్చులకు అప్పు చేశాడు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువ అయ్యాయి. రూ. 3  లక్షల వరకు అప్పుకాగా.. ఎలా తీర్చేది అంటూ బాధపడుతున్నాడు.  రెండు రోజుల కింద వెడ్డింగ్ ఈవెంట్ కు  వరంగల్ వెళ్లి తిరిగి బుధవారం ఉదయం ఇంటికి వచ్చాడు. 

మధ్యాహ్నం “ నాని బట్టలు సర్దుకో.. మనం ఊరికి వెళ్దాం.. ఇద్దరి తమ్ముళ్లను బాగా చూసుకో.. అంటూ తండ్రి అన్నట్టు పెద్ద కొడుకు సుజిత్ తెలిపాడు. గదిలోకి వెళ్లి డోర్ వేసుకోగా.. కొద్ది సేపటి తర్వాత ఎంత పిలిచినా డోర్ తీయలేదు.  పక్కింటి వాళ్లను పిలిచి  డోర్ పగలగొట్టి చూడగా భర్త ఉరేసుకుని కనిపించాడని భార్య అనిత రోధిస్తూ తెలిపింది. చిన్న కొడుకు తండ్రిని తట్టి లేపడం తతతతపలువురిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ చార్జ్ ఎస్ ఐ వినీతారెడ్డి తెలిపారు.

జనగామ జిల్లాలో కారు కొనివ్వడం లేదని..

జనగామ, వెలుగు:  కారు కొనివ్వలేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. టౌన్​సీఐ దామోదర్​రెడ్డి కథనం ప్రకారం .. జనగామ మండలం మరిగడికి చెందిన కూరాకుల సాయిరాజ్(22) డ్రైవర్​గా చేస్తున్నాడు. కొంతకాలంగా తనకు కారు కొనివ్వాలని తండ్రిని అడుగుతున్నాడు.  దీంతో తండ్రి కనకయ్య తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో మనస్తాపం చెందిన సాయిరాజ్​బుధవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు చీరతో ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.