
కరోనా వైరస్ తో ఆందోళన చెందుతున్న వారికోసం జపాన్ కు చెందిన ఓ సంస్థ శవపేటికల్ని అరేంజ్ చేస్తుంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆందోళన కు గురవుతున్నట్లు పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి.
అయితే జపాన్ టోక్యోకు చెందిన స్కేర్ స్క్వాడ్ సంస్థ కరోనా వైరస్ పై భయంతో తీవ్ర ఒత్తిడికి గురువుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించింది. ఎవరైతే తాము తయారు చేసిన శవపేటికలో పడుకుంటారో వాళ్లు..ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని..కావాలంటే ట్రైచేయండి అంటూ ఔత్సాహికులకు ఓ ఆఫర్ ప్రకటించింది.
కరోనా కారణంగా ఒత్తిడికి గురైన కష్టమర్లు 2మీటర్ల పొడవుతో తయారు చేసిన శవపేటికల్లో పడుకోవచ్చు. సమయాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. ఆ శవ పేటికల్లో హర్రర్ స్టోరీస్ వినొచ్చు. సినిమాలు చూడొచ్చు. పెద్దగా కేకలు వేయాలంటే వేసుకోవచ్చు. అలా చేయడం వల్లే తనలో ఒత్తిడి మాయమైనట్లు 36 ఏళ్ల కజుషిరో హషిగుచి చెప్పాడు. ఈ సందర్భంగా స్వేర్ స్క్వాడ్ సంస్థ ప్రతినిధి ఒకిమా మాట్లాడుతూ మాకు ఈ ఐడియా బాగా నచ్చింది. బిజినెస్ బాగా జరుగుతోంది. మా కష్టమర్లు సంతృప్తితో ఉన్నారంటూ సంతోషం వ్యక్తం చేశాడు.