అసెంబ్లీలోని ఎల్పీ భవనం కూల్చివేత : సర్కార్ సంచలన నిర్ణయం

అసెంబ్లీలోని ఎల్పీ భవనం కూల్చివేత : సర్కార్ సంచలన నిర్ణయం

అసెంబ్లీ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత వాడకంలోలేని పాత అసెంబ్లీ భవనాల వినియోగం, సుందరీకరణపై దృష్టి సారించింది.  పాత అసెంబ్లీని శాసన మండలికి వాడుకోవాలని నిర్ణయించింది. శాసన సభా పక్ష పార్టీల కార్యాలయాలున్న ఎల్పీ భవనం కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్పీ భవనం జాగాలో సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి శాసనసభా ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.