ప్రభాస్ బుగ్గ గిల్లిన లేడీ ఫ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో

ప్రభాస్ బుగ్గ గిల్లిన లేడీ ఫ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే చాలు.. సంబరాలు చేసుకుంటారు. ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఎక్కడ, ఎప్పుడు కలిసినా వాళ్ళను ప్రేమగా దగ్గరకు తీసుకొని సెల్ఫీలు ఇస్తుంటారు. ఇక ఆయనకున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్.. డార్లింగ్.. అంటూ పడిచచ్చిపోతారు ప్రభాస్ అంటే. 

ఇక తాజాగా ప్రభాస్ లేడీ ఫ్యాన్ ఒకరు ఆయనతో వింతగా ప్రవర్తించారు. ఆయనను కలిసిన ఆనందంలో ప్రభాస్ చెంపపై టచ్ చేసి తెగ సిగ్గుపడిపోయారు ఆ ఫ్యాన్. ఇటీవల ప్రభాస్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ఆయన్ని చూడగానే ఒక లేడీ ఫ్యాన్ ఆయన దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగారు. దానికి ప్రభాస్ తన భుజంపై చేసి వేసి మరీ ఫోటో ఇచ్చారు. సెల్ఫీ తీసుకొని వెళ్తుండగా ప్రభాస్ చెంపను తాకి సిగ్గుపడుతూ అక్కడినుండి వెళ్ళిపోయింది ఆ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అయన ప్రశాంత్ నీల్(Prashanrh neel) దర్శకత్వంలో సలార్(Salaar) సినిమా చేస్తున్నారు. శృతి హాసన్(Shruthi haasan) హీరోయిన్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.