మహబూబ్ నగర్లో భారీగా నామినేషన్లు

మహబూబ్ నగర్లో భారీగా నామినేషన్లు
  • వనపర్తిలో 9 నామినేషన్లు

వనపర్తి, వెలుగు: వనపర్తి అసెంబ్లీ స్థానానికి 9 మంది   రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతిరావుకు గురువారం నామినేషన్లు అందజేశారు. బీఆర్ఎస్  నుంచి ఎస్.నిరంజన్ రెడ్డి, బీఎస్పీ నుంచి ఎన్. చెన్న రాములు, పిరమిడ్ పార్టీ నుంచి ఉమేశ్​గౌడ్, డీఎస్పి పార్టీ నుంచి రామకృష్ణ, అలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్ పార్టీ నుంచి కుందేళ్ల అర్జున్ నామినేషన్​ వేశారు.  ఇండిపెండెంట్లుగా గంధి వెంకటరమణ, పూరి సురేశ్ శెట్టి, గంగవరం రామకృష్ణ, బంక ఎల్లయ్య తమ నామినేషన్లను ఆర్వోకు అందించారు.

నారాయణపేటలో 3 నామినేషన్లు

నారాయణపేట, వెలుగు : నారాయణపేటలో గురువారం 3 నామినేషన్లు నమోదయ్యాయి. బీఆర్ఎస్ తరపున ఎస్​.రాజేందర్​రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆర్​ఓకు రెండు సెట్ల నామినేషన్​ దాఖలు చేశారు. అలాగే ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఈశ్వర్, ఇండిపెండెంట్ గా సత్యనారాయణ బండ  నామినేషన్ వేశారు.

మక్తల్​లో మూడు నామినేషన్లు

మక్తల్​,వెలుగు : మక్తల్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గురువారం ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్​అభ్యర్థిగా ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్​ రెడ్డి  స్థానిక ఆంజనేయస్వామి టెంపుల్​లో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్​వేశారు.    కాంగ్రెస్​ అభ్యర్థి వాకిటి శ్రీహరి తరపున కాంగ్రెస్   నాయకులు మాన్వి రామారావు, శ్రీనివాస్​, రవి కుమార్​ నామినేషన్​ వేశారు.  బీఎస్పీ తరపున వీజేఆర్ ఫౌండేషన్​ అధినేత వర్కటం జగన్నాథరెడ్డి నామినేషన్​ ను  ఆర్వోకు అందచేశారు.  
 
నాగర్​ కర్నూల్​ జిల్లాలో  

నాగర్​ కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం ప్రధాన పార్టీల తరపున నామినేషన్లు దాఖలయ్యాయి.  నాగర్​ కర్నూల్ లో​ కాంగ్రెస్​ అభ్యర్థి డా.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. పీససీ  వైస్​ ప్రసిడెంట్​ డా.మల్లు రవి తదితరులు వెంటరాగా రాజేశ్​ నామినేషన్​ వేశారు.  బీఎస్పీ నుంచి కొత్తపల్లి కుమార్​, అలయన్స్ ఆఫ్ డెమోక్రసీ రిఫార్మ్స్​  పార్టీ నుంచి  కర్నె జానకి రాములు, బహుజన్ ముక్తి పార్టీ నుంచి  గడ్డం విజయ్ కుమార్, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ నుంచి మిద్దె రాములు, ఇండిపెండెంట్లుగా ఖానాపురం ముకేశ్​, వడ్డే శివకృష్ణ నామినేషన్లు వేశారు. 
కొల్లాపూర్ లో  కాంగ్రెస్​ అభ్యర్థిగా జూపల్లి నామినేష న్​ దాఖలు వేశారు.  

బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్దన్​రెడ్డి భార్య బీరం విజయ, బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్​ రావు,  బీఎంపీ నుంచి కిష్టన్న, సమైక్యాంద్ర పరిరక్షణ సమితి నుంచి జి.విక్రం, బీసీపీ నుంచి కృష్ణయ్య గౌడ్​, కె.తిరుపతమ్మ, కర్నె శిరీష, నేనావత్​ శివుడు నామినేషన్​ దాఖలు చేశారు.  కల్వకుర్తి  నుంచి బీజేపీ అభ్యర్థి  టి.ఆచారి తరఫున ఆయన భార్య గీత, బీఎస్పీ నుంచి కొమ్ము శ్రీనివాస్​, డీఎస్పీ నుంచి వి.రమేశ్, ప్రజాశాంతి పార్టీ నుంచి కట్ట జంగయ్య, పాండు రంగయ్య, యాదమ్మ, ఆంజనేయులు, బూర్యా నాయక్​ ఇండిపెండెంట్లుగా నామినేషన్​ దాఖలు చేశారు. అచ్చంపేట సెగ్మెంట్​లో కాంగ్రెస్​ నుంచి డా.వంశీకృష్ణ, బీఆర్​ఎస్​ నుంచి గువ్వల బాలరాజు భార్య గువ్వల అమల, మరో ఇండిపెండెంట్​ అభ్యర్థి నామినేషన్​ దాఖలు చేశారు.

 గద్వాల జిల్లాలో.. 

గద్వాల, వెలుగు :  జిల్లాలో 24 నామినేషన్లు దాఖలయ్యాయి. గద్వాల నుంచి ఎనిమిది నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అపూర్వ్ చౌహాన్ తెలిపారు. బీఎస్పీ తరపున అతికు రహమాన్, బీజేపీ తరపున బలిగేర బోయ శివారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్  నుంచి గంగోళ్ల రంజిత్ కుమార్, స్వతంత్ర అభ్యర్థులుగా వెంకటేశ్ ​నాయక్, ఉప్పరి రవికుమార్, భారతీయ సురేశ్​ కాంగ్రెస్ తరపున కృష్ణ, బీఆర్ఎస్ తరఫున బండ్ల జ్యోతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరఫున ఆయన బామ్మర్ది మోహన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. 

అలంపూర్ నుంచి  16 నామినేషన్ సెట్లను దాఖలు చేసినట్లు ఆర్వో చంద్రకళ తెలిపారు. బీఆర్ఎస్ నుంచి విజయుడు మూడు సెట్ల నామినేషన్లు, బీజేపీ నుంచి  బంగి లక్ష్మన్న రెండు సెట్ల నామినేషన్లు,  ఏఐఎస్పీ నుంచి లింగన్న రెండు సెట్ల నామినేషన్, బీఎస్పీ నుంచి  కేశవులు  రెండు సెట్ల నామినేషన్లు,  బీజేపీ నుంచి చిన్న మల్లయ్య ఒక సెట్ నామినేషన్, మీరమ్మ  ఒక సెట్టు, ఇండిపెండెంట్ గా మరొక సెట్టు, మాదన్న, ప్రేమలత, బిసన్న ఇండిపెండెంట్ గా ఒక్కొక్క  నామినేషన్లు దాఖలు చేశారు.