బోనులో చిక్కిన చిరుత

V6 Velugu Posted on Sep 12, 2021

మెదక్: కొంతకాలంగా స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామరం తండాలో ఓ చిరుత గత కొంతకాలం నుంచి సంచరిస్తుంది. రాత్రి వేళ కట్టేసిన పశువులపై దాడులు చేస్తూ.. స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. దాంతో ఆందోళన పడ్డ గ్రామస్తులు.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత పట్టుకోవాలని అధికారులు.. గ్రామంలో అక్కడక్కడ బోనులు ఏర్పాటుచేశారు. ఆ చిరుత శనివారం రాత్రి ఓ బోనులో పడింది. గమనించిన స్థానికులు.. వెంటనే అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. గ్రామానికి చేరుకున్న సిబ్బంది.. చిరుతను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఘటనా స్థలానికి చేరుకొని తరలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Tagged Medak, Leopard, Forest Department, chinna shankarampet, kamaram thanda, sp chandana deepthi

Latest Videos

Subscribe Now

More News