సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర

సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర

సుడిగాలి సుధీర్ హీరోగా  నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’.  అరుణ్ విక్కిరాలా ద‌‌‌‌ర్శక‌‌‌‌త్వంలో విజేష్ త‌‌‌‌యాల్‌‌‌‌, చిరంజీవి ప‌‌‌‌మిడి, వెంక‌‌‌‌టేశ్వర్లు క‌‌‌‌టూరి నిర్మిస్తున్నారు. డాలిషా హీరోయిన్‌‌‌‌. మంగళవారం ఈ సినిమా నుంచి ‘కనుల నీరు రాలదే’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌ను రిలీజ్  చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో సుధీర్ మాట్లాడుతూ ‘ఈ మెలోడీ సాంగ్ అందర్ని ఆకట్టుకుంటుంది.

మోహిత్ కంపోజ్ చేసిన పాటకు సుద్దాల అశోక్ తేజ అర్ధవంతమైన లిరిక్స్ రాశారు. యజిన్ నజిర్ పాడిన విధానం బాగుంది.  డాలీషా నార్త్ అమ్మాయి అయినా తెలుగు నేర్చుకుని మరీ నటించింది’ అని చెప్పాడు.

అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది డాలీషా. మోహిత్ మ్యూజిక్, మార్క్ కె రాబిన్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు సినిమాకు ప్లస్ అవుతాయి అన్నాడు దర్శకుడు అరుణ్. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ..  ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ని ఇస్తుందని నిర్మాతలు చెప్పారు. బెక్కెం వేణుగోపాల్,  మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, సినిమాటోగ్రాఫర్  డి. శశి కిరణ్ పాల్గొన్నారు.