ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఫోన్‌లో బెదిరించిన వ్యక్తి అరెస్టు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఫోన్‌లో బెదిరించిన వ్యక్తి అరెస్టు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు  అరెస్టు చేశారు.   రాజాసింగ్ ను కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు. అతడిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు.  వసీం గత పదేళ్లుగా దుబాయిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. వసీం హైదరాబాద్ పాతబస్తీ బార్కస్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతరు రాజా సింగ్ కు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నట్లు గుర్తించారు.