అక్రమ కట్టడాలను కూల్చడానికి వెళ్లిన సిబ్బందిపై దాడి

అక్రమ కట్టడాలను కూల్చడానికి వెళ్లిన సిబ్బందిపై దాడి

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్మికులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గుండ్లపోచంపల్లి గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులపై కృష్ణంరాజు అనే వ్యక్తి దాడి చేశాడు. అసభ్యపదజాలంతో తిడుతూ కర్రతో దాడిచేసినట్లు కార్మికులు తెలిపారు.

ఈ ఘటనలో పలువురు సిబ్బందికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఘటనపై కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడిన చేసిన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.