
బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఇంట్లో కూలర్‌కు కరెంట్ సప్లై అయి షాక్ కొట్టి వ్యక్తి మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేటలో జరిగింది. పోలీసుల తెలిపిన ప్రకారం.. పెద్దపేటకు చెందిన వశాక పోసుమేర(49) గురువారం పొలానికి వెళ్లి వర్షానికి తడిసి ఇంటికి వచ్చాడు. కూలర్ ఆన్ చేసి ఉండగా.. దాన్ని తాకడంతో షాక్ కొట్టి కిందపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. మృతుడికి భార్య నానుబాయి, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.