వర్షపు నీటి గుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి..చందానగర్ రైల్వే స్టేషన్ అండర్ పాస్ లో ఘటన

వర్షపు నీటి గుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి..చందానగర్ రైల్వే స్టేషన్ అండర్ పాస్ లో ఘటన

చందానగర్, వెలుగు: చందానగర్ రైల్వే స్టేషన్ అండర్​పాస్​లో నిలిచిన వర్షపు నీటిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చందానగర్ రైల్వే అండర్​పాస్​లో భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎవరూ అటుగా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

ఆదివారం ఉదయం 11:30 గంటల సమయంలో స్థానికులు ఈ నీటిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చందానగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తలకు గాయం ఉండడంతో.. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.