
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. తంగళపల్లి మండలం తాడూరు గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో జాతీయ జెండా పట్టుకుని సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. సెల్ టవర్ ఎక్కి తలకిందులుగా జెండా ఎగురవేసి తాడుతో జెండాను కట్టేసాడు. కాసేపు పోలీసులకు చుక్కలు చూపించాడు. ఎట్టకేలకు స్థానికులు, పోలీసులు అతడిని కిందకు దించారు.
సెల్ టవర్ ఎందుకు ఎక్కావని అడిగితే వందే మాతరం అంటూ హంగామా చేశాడు శ్రీనివాస్. నా భారత దేశం.. నా మాతృభూమి, నా సహోదరులు పిచే మూడ్ అంటూ పోలీసులకు సెల్యూట్ చేస్తూ కాసేపు హల్ చల్ చేశాడు.