
కుత్బుల్లాపూర్: నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై ఓ కామాంధుడు నీచానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి బాలిక ఇంటి ముందు సైకిల్ తొక్కుతుండగా మాయమాటలు చెప్పి సమీపంలోని ఓ టెంట్ హౌస్ దుకాణంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక గట్టిగా కేకలు వేయడంతో అక్కడినుండి పరారయ్యాడు.
ఈ కేసులో జీడిమెట్ల పోలీసులు త్వరగతిన పురోగతి సాధించారు. ఇప్పటికే నిందితుడు అమరనాథ్(35)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడిని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధిత బాలిక ఆరో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా నివాసముంటోంది.