హత్య కేసులోని దోషికి జీవితకాలం జైలు శిక్ష విధించిన కోర్టు

హత్య కేసులోని దోషికి జీవితకాలం జైలు శిక్ష విధించిన కోర్టు

500 కోసం మహిళ హత్య.. యువకుడికి జీవిత ఖైదు

ఎల్బీనగర్, వెలుగు: రూ. 500 కోసం మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడికి ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా 9వ అదనపు కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసుల ప్రకారం..2021 నవంబర్ 12న పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డులోని గండిచెరువు బ్రిడ్జి సమీపంలో సర్వీస్ రోడ్డుపై 35 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళను హత్య చేసింది సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన షేక్ బడేమియా(24)గా గుర్తించారు. అన్ని ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా అతడిని కోర్టు దోషిగా తేల్చింది.షేక్ బడేమియాకు జీవితఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ  తీర్పు ఇచ్చింది. కాగా.. హత్యకు గురైన మహిళ వివరాలు మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన ఎల్బీనగర్ డీసీపీ, వనస్థలిపురం ఏసీపీ,అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ సిబ్బందిని రాచకొండ సీపీ అభినందించారు.