రీజనల్ రింగ్ రోడ్ పై బిగ్ అప్ డేట్.. ఈ సర్వే నంబర్లకి HMDA నోటిస్ జారీ..

రీజనల్ రింగ్ రోడ్ పై బిగ్ అప్ డేట్.. ఈ సర్వే నంబర్లకి HMDA నోటిస్ జారీ..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో 100 మీటర్ల వెడల్పుతో  రీజినల్ రింగ్ రోడ్ (RRR) అలైన్‌మెంట్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ అలైన్‌మెంట్ ఎనిమిది జిల్లాలు, 33 మండలాలు అలాగే 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలకి విస్తరించగా, డిజిటల్ మ్యాప్‌లు & సర్వే నంబర్‌లను HMDA  అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

ప్రజలు, సంస్థలు 15 సెప్టెంబర్  2025లోపు ఏదైన అభ్యంతరాలు, సూచనలు ఉంటే HMDA కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. దీని తర్వాత HMDA చివరి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.

RRR రూట్‌మ్యాప్: ఈ ఎక్స్‌ప్రెస్‌వే రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి  వెళుతుంది. 

రంగారెడ్డి జిల్లాలో చూస్తే అమన్గల్, ఫరూఖ్ నగర్, కేశంపేట్, కొందుర్గ్, మాడ్గుల్, తలకొండపల్లెతో సహా మండలాల్లోని గ్రామాల మీదుగా  వెళ్తుంది.

వికారాబాద్ జిల్లాలో మోమిన్‌పేట్, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల మీదుగా వెళుతుంది.

నల్గొండ జిల్లాలో చండూరు, చింతపల్లి, మర్రిగూడ, మరియు మునుగోడు మండలాల మీదుగా,  

సంగారెడ్డి జిల్లాలో హత్నూర, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. 

సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, రాయపోల్, వర్గల్ మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి.

మెదక్ జిల్లాలో నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్ మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్, నారాయణపూర్, భువనగిరి, తుర్కపల్లి, వలిగొండ, యాదగిరిగుట్ట మండలాల మీదుగా ఈ RRR   వెళుతుంది. చివరగా మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండలంలోని గ్రామాలు కూడా ఉన్నాయి. 

ఈ ప్రాంతీయ రింగ్ రోడ్డు జాతీయ అలాగే రాష్ట్ర రహదారులను కలుపుతుంది. అలాగే ప్రాంతీయ రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ హైదరాబాద్ చుట్టూ కనెక్టివిటీని పెంచుతుంది.  ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి దాదాపు 30 నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే హైదరాబాద్ లోపల ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని, మారుమూలా ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఇంకా తెలంగాణ అంతటా వృద్ధిని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.