R Ashwin: ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వేలానికి అశ్విన్ పేరు

R Ashwin: ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వేలానికి అశ్విన్ పేరు

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ లో సూపర్ ప్లాన్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. ప్రపంచ లీగ్ లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వేలానికి ఈ ఆఫ్ స్పిన్నర్ సైన్ అప్ చేసినట్లు సమాచారం. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వేలం సెప్టెంబర్ 30న దుబాయ్‌లో జరుగుతుంది. లీగ్ నిర్వాహకులు అశ్విన్ ను అధికారిక ఎంట్రీని వేలానికి అందుకొని అందుకున్నట్టు తెలుస్తోంది. అతని రిజిస్ట్రేషన్ కోసం నమోదు ఫార్మాలిటీలను చేస్తున్నారు.

"ILT20 వేలానికి నా పేరు పంపాను. నన్ను ఎవరైనా కొంటారని ఆశిస్తున్నా". అని అశ్విన్ వెల్లడించాడు. ఇప్పటివరకు మూడు ఎడిషన్‌లను పూర్తి చేసుకున్న ఈ టోర్నమెంట్‌లో దుబాయ్ క్యాపిటల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లలో ఇండియన్ ప్లేయర్స్ ఆడడానికి పర్మిషన్ ఉండదు. ఐపీఎల్ మార్కెట్ విలువ కాపాడటానికి మన క్రికెటర్లను ప్రపంచ లీగ్ ల్లో ఆడించేందుకు బీసీసీఐ  అనుమతించదు.

అశ్విన్ గత ఏడాది డిసెంబర్ లో ఇండియాలోని అన్ని క్రికెట్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.  ఇటీవలే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో ఈ తమిళనాడు స్పిన్నర్ కు ప్రపంచ క్రికెట్ లోని లీగ్ లు ఆడడానికి లైన్ క్లియర్ అయింది. కొన్ని రోజుల క్రితం అశ్విన్ ది హండ్రెడ్‌లో ఆడతాడనే ప్రచారం సాగింది. సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లోనూ కనిపించే అవకాశాలున్నాయని రిపోర్ట్స్ చెప్పుకొచ్చాయి. 

ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పై ఆసక్తి చూపిస్తున్న అశ్విన్.. భవిష్యత్తులో ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్, సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లోనూ కనిపించినా ఆశ్చర్యం లేదు. అశ్విన్ ఇటీవలే విదేశీ లీగ్‌లలో ఆడాలనే తన కోరికను బయట పెట్టిన సంగతి తెలిసిందే. అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 

ఐపీఎల్ విషయానికి వస్తే 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో మొత్తం ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ తరుఫున ఆడాడు. పంజాబ్‎కు కెప్టెన్‎గా కూడా పని చేశాడు ఈ దిగ్గజ బౌలర్.బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.