ఒక టెక్నాలజీతో మూడు ప్రాజెక్టులు కట్టారు..ఇపుడు మూడు బ్యారేజీలకు ముప్పు: పొంగులేటి

ఒక టెక్నాలజీతో మూడు ప్రాజెక్టులు కట్టారు..ఇపుడు మూడు బ్యారేజీలకు  ముప్పు: పొంగులేటి

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణాలేంటో చెప్పారు. 

ఒకే టెక్నాలజీతో మూడు ప్రాజెక్టులు కట్టారని..ఇపుడు మూడు బ్యారేజ్ లు ప్రమాదంలో ఉన్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  సీకెండ్ ఫైల్ టెక్నాలజీ వాడటమే ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడిందన్నారు. మామ చెప్పగానే అల్లుడు ఇంప్లిమెంట్ చేశారని తెలిపారు. కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ కట్టనందుకే ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు పొంగులేటి. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ కు రూ. 3 లేదా 4 వందల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.  కేసీఆర్ ఫామ్ హౌజ్ లోని బావి సైజులో రంధ్రం పడిందన్నారు పొంగులేటి.  మేడిగడ్డలో 7వ బ్లాక్ మాత్రమే కాదు..3 బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయన్నారు.