హైదరాబాద్ లోని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. 2023 జూలై 09 ఆదివారం రాత్రి వచ్చిన ఆకాష్ సింగ్ (27) అనే యవకుడు కరెంట్ షాక్ తో చనిపోయాడు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఇంతవరకు విద్యుత్ అధికారులు చర్యలు చెపట్టలేదు. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ బేగంబజార్ లో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. గతంలోనూ ఓ వ్యక్తి ఇలాగే... ఇదే పోల్ షాక్ తగిలి మృతి చెందాడు.
