
రత్లాం: రేప్ కేసులో రెండేండ్లు జైల్లో ఉండి.. నిర్దోషిగా విడుదలైన ఓ వ్యక్తి.. అన్యాయంగా తనను జైలుపాలు చేసినందుకు రూ.10,006.02 కోట్లు పరిహారంగా ఇవ్వాలని మధ్యప్రదేశ్ గవర్నమెంట్‌పై కేసు వేశాడు. 2018 జూలై 8న గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన కేసులో రత్లాం పోలీసులు కాంతిలాల్ భీల్(35)ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భీల్‌ను 2020 డిసెంబర్ 23న పోలీసులు అరెస్టు చేశారు. తనకే పాపం తెలియదని భీల్ వేడుకున్నా వినలేదు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత 2022 అక్టోబర్ 20న స్థానిక కోర్టు భీల్‌ను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. దీంతో భీల్ తనను మానసిక వేదనకు గురిచేసినందుకు, తన కుటుంబం పస్తులు ఉండడానికి కారణమైనందుకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని రత్లాం కోర్టును ఆశ్రయించాడు.