పాతబస్తీలో సినీఫక్కీలో వెంటాడి దారుణహత్య

V6 Velugu Posted on Oct 13, 2021

హైదరాబాద్: పాతబస్తీలో సినీ ఫక్కీలో పట్టపగలు దారుణహత్య జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మాబాద్ బండ్ల గూడ రోడ్ పై ఓ యువకుడు ని వేటాడి మరణయుధాలతో నరికి పారిపోయారు. కొనఊపిరితో ఉండగా చూసి ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ పాతబస్తీ బర్కస్ నివాసి హమీద్ జుబేది  (45) వెస్టర్న్ యూనియన్ ఆఫ్ మనీ (Western Uninon of Money) నిర్వహిస్తున్నాడు. బండ్ల గూడా ప్రధాన రహదారి పై కారులో వెళ్తుండగా వెంటాడుతూ వచ్చిన దుండగులు కారు ఆపి.. కారులోంచి కిందకు లాగి మరణయుధాలతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడిపోయాడు. పోలీసులు వచ్చి చూడాగా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయాడు. 

దుండగులు మృతుడి రాకపోకలపై పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి.. వెంటాడుతూ వచ్చి అదను చూసి దారుణానికి ఒడిగట్టారు. పగటిపూట జనం సంచారం ఉన్న సమయంలో జరిగిన ఈ దారుణహత్య సంచలనం సృష్టించింది.  పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tagged Hyderabad, murder, bandlaguda, chandrayanagutta, , Hameed Jubedi, Hasmabad Bandlaguda, Western union of money, attacked with weapons

Latest Videos

Subscribe Now

More News