పోలీసులు ఫోన్​ లాక్కున్నారని పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుండు 

పోలీసులు ఫోన్​ లాక్కున్నారని పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుండు 
  • సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన

సంగారెడ్డి, వెలుగు: పోలీసులు తన ఫోన్ లాక్కుని తిరిగి ఇవ్వలేదని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డిలోని రాజంపేటకు చెందిన సంతోశ్​కుమార్ గురువారం బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్​తనిఖీ చేయడాన్ని చూశాడు. వెంటనే ఫోన్ లో తనిఖీల ఫొటోలు, వీడియో తీశాడు. గమనించిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ ఫోన్​లాక్కున్నారు.

ఎంతసేపు బతిమలాడినా ఫోన్​ఇవ్వకపోవడంతో సంతోశ్ వెంటనే పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి వెళ్లాడు. బాటిల్​లో పెట్రోల్ పోయించుకుని హైవేపైకి వచ్చాడు. పోలీసుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు సంతోష్ కుమార్ పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి సంగారెడ్డి గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం సంతోశ్​50 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు.