
సాంకేతిక యుగంలో చాట్‌జిపిటి సంచలనాలు సృష్టిస్తోంది. ఆ మధ్య ఓ యవకుడు ఆన్లైన్ లో పాఠాలు చెబుతూ దాదాపు రూ.18 లక్షలు సంపాదించాడు. ఇటీవల ఎచాట్‌జిపిటి సూచనలతో జాషువా బ్రౌడర్ అనే మరో వ్యక్తి నిమిషం వ్యవధిలో దాదాపు 210 (దాదాపు రూ.17,000 ) డాలర్లు సంపాదించారు. దీనికి సంబంధించిన వివరాలను అతను ట్వీట్ చేశాడు. లీగల్ సర్వీస్ చాట్‌బాట్ అయిన DoNotPay CEO, జాషువా బ్రౌడర్ చాట్‌జిపిటి సాయంతో డబ్బును పొందిన స్టోరీని ట్వీట్‌లో వివరించారు.
తన పేరు జాషువా బ్రౌడర్ అని తాను కాలిఫోర్నియాలో నివసిస్తున్నాని , తన డేట్ ఆఫ్ బర్త్ 12/17/96. నాకు కొంత డబ్బు దొరుకుతుందా? అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ పాజిటివ్‌గా స్పందించింది. చాట్‌జిపిటి సూచనలతో బ్రౌడర్ కాలిఫోర్నియా గవర్నమెంట్ నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలో దాదాపు 210 డాలర్లు అందుకున్నారు. చాట్‌జిపిటి బ్రౌడర్ గతంలో క్లెయిమ్ చేయని, ఇన్‌వాయిస్‌లను చూపింది.
జాషువా బ్రౌడర్ మాట్లాడుతూ..ముందు కాలిఫోర్నియా స్టేట్ కంట్రోలర్ అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని చాట్‌జిపిటి సూచించిందని తెలిపాడు. ఈ వెబ్‌సైట్‌లో వినియోగదారులను రీఫండ్‌లకు సంబంధించి సంప్రదించలేని కంపెనీలు, ఆ డబ్బు వివరాలు ఉంటాయన్నాడు. చాట్‌జిపిటి తన పేరిట ఉన్న మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అనుసరించాల్సిన స్టెప్స్‌ను వివరించిందని తెలిపాడు. ఆ సూచనలను తాను ఫాలో అయ్యానని, కేవలం ఒక నిమిషం తర్వాత తన అకౌంట్‌లో 209.67 డాలర్లు క్రెడిట్ అయ్యాయయని బ్రౌడర్ ట్విట్టర్ థ్రెడ్‌లో వివరించారు. అయితే ఈ ప్రాసెస్ మొత్తాన్ని ChatGPT ఆటోమేటిక్‌గా పూర్తి చేయగలదని, కానీ క్యాప్చాని మాత్రం అధిగమించలేదని బ్రౌడర్ వెల్లడించాడు.