
ఢిల్లీ: బంధువుకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బైకును దొంగతనం చేశాడు ఓ యువకుడు. సేవానగర్ లో జరిగిందీ ఘటన. పోలీసుల విచారణలో నిందితుడు చెప్పిన కారణం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సాధారణంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎవరైనా కొత్తది కొని ఇస్తారు. అయితే కోట్ల ముబారక్ నగర్ లోని ఓ దాబాలో పనిచేస్తున్న బిహారీ బాబు శివశంకర్ (25) ఏకంగా బైకును దొంగతనం చేసి.. దాన్ని దీపావళి సందర్భంగా బంధువుకు గిఫ్ట్ గా పంపేందుకు ప్రయత్నించాడు. వీలు కుదరకపోవడంతో ఒక దశలో అమ్మాలని రకరకాలుగా ఆలోచించాడు. తన సొంతూరు బీహార్ లోని సీతామర్హిలోని బంధువులకు బైకును పంపేందుకు ప్రయత్నిస్తూ… అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల నిఘాకు దొరికిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజీలో నిందితుడు శివశంకర్ ను గుర్తించిన పోలీసులు రెడ్ హ్యాండె గా పట్టుకున్నాడు. ఢిల్లీలో తాను మంచి పొజిషన్ లో ఉన్నానని.. బాగా సంపాదిస్తున్నానని బంధువుల్లో బిల్డప్ ఇచ్చుకోవడం వల్లే ఇలా అడ్డదారిలో తన దర్పాన్ని చాటుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోందంటున్నారు పోలీసులు.
Read more news
మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..