స్కూల్ డ్రెస్కు డబ్బులివ్వలేదని తల్వార్ పట్టిన తండ్రి

 స్కూల్ డ్రెస్కు డబ్బులివ్వలేదని తల్వార్ పట్టిన తండ్రి

ప్రభుత్వ స్కూల్లో చదివే తన పిల్లలకు యూనిఫామ్, పుస్తకాల డబ్బులు ఇంకా ఇవ్వలేదంటూ ఓ వ్యక్తి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఏకంగా తల్వార్ చేతపట్టి స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయులను హెచ్చరించాడు. యూనిఫామ్, పుస్తకాల డబ్బులు ఇంకా ఎందుకు ఇవ్వలేదంటూ.. తల్వార్ చేతిలో పట్టుకొని చిందులు వేశాడు. నోటికొచ్చినట్టు వాగాడు. ఈఘటన బిహార్ లోని అరారియా నగరం పరిధిలో చోటుచేసుకుంది.

తల్వార్ తో ఉపాధ్యాయులను బెదిరించిన వ్యక్తిని స్కూల్ కు సమీపంలోనే నివసించే అక్బర్ గా గుర్తించారు. అతడు వెళ్లిపోయిన వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్ జహంగీర్.. జోకీహాట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు అక్బర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బిహార్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు యూనిఫామ్, పుస్తకాలు కొనుక్కొనేందుకు నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.