
పద్మారావునగర్, వెలుగు: మహంకాళి పీఎస్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజు థియేటర్ సమీపంలో ఫుట్ పాత్‌పై నివసిస్తున్న దాదాపు 55 ఏండ్ల వ్యక్తిని శనివారం అర్ధరాత్రి ఓ దుండగుడు గ్రానైట్ రాయితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఘర్షణ జరిగిందా? లేదా హత్యకు మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.