శ్రీశైలం ఘాట్ రోడ్దు దగ్గర తుపాకీ కలకలం

శ్రీశైలం ఘాట్ రోడ్దు దగ్గర తుపాకీ కలకలం

నంద్యాల జిల్లా  శ్రీశైలంలో తుపాకీ కలకలం సృష్టించింది.  శ్రీశైలం టోల్ గేట్ దగ్గర టెంపుల్ సిబ్బంది  వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తుపాకీతో పట్టుబడ్డాడు.  దొరికిన తుపాకీని శ్రీశైలం సీఐ ప్రసాదరావుకు అందజేశారు టెంపుల్ సెక్యూరిటీ.  

ఆ వ్యక్తిని విచారించగా  తాను మధ్యప్రదేశ్ క్రైం బ్రాంచ్ సీఐ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఓ కేసు విషయంలో  శ్రీశైలం వచ్చినట్లు పోలీసులతో చెప్పారు.   శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి  దర్శనార్థమై శ్రీశైలం వచ్చామని చెప్పారు.  అతడి నుంచి ఐడీ కార్డు, తుపాకీ తీసుకున్న  శ్రీశైలం సీఐ ప్రసాదరావు విచారిస్తున్నామని  తెలిపారు.