ఐడియా బాగుంది. కానీ ఇలా సోషల్ డిస్టెన్స్ పాటించడమే కష్టమని అంటున్నారు స్థానికులు. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇంట్లోనే కాదు ఎక్కడికి వెళ్లినా సరే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ విషయంలో అమెరికాకు చెందిన పలు రెస్టారెంట్ల ఓనర్లు ముందు వరసలో ఉంటున్నారు.
అమెరికాలో లాక్ డౌన్ ను ఎత్తేయడంతో ఆయా ప్రాంతాలకు చెందిన రెస్టారెంట్ల యజమానులు సోషల్ డిస్టెన్స్ తో కష్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
రెస్టారెంట్ కు వచ్చే భోజన ప్రియులు తప్పని సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అదెలా అంటారా. మేరీలాండ్ ఓషన్ సిటీలో ఫిష్ టేల్స్ రెస్టారెంట్ యాజమాన్యం ట్యూబ్ ప్లాన్ ను అప్లయ్ చేసింది. పెద్ద పెద్ద ఇన్ ఫ్లాటబుల్ ట్యూబులను ఏర్పాటు చేసింది. ఆ ట్యూబ్ ల్లోకి చొరబడి ..తోసుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్లి వాళ్లకు నచ్చిన ఐటమ్ ను ఆర్డర్ చేసుకొని తినేయోచ్చు. ఐడియా బాగుంది కానీ ట్యూబుల్లోకి చొరబడడమే ఇబ్బందిగా ఉందని అంటున్నారు భోజన ప్రియులు. ట్యూబుల్లోకి చొరబడి..గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని అంటున్నారు.
