గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం..

గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం..

హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  మనేసర్‌లోని ఒక బట్టల తయారీ యూనిట్‌లో గురువారం, మే 30వ తేదీన ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భవనం మొత్తం చుట్టుముట్టాయి. దీంతో భవనం పరిసరాల్లో దట్టంగా నల్లని పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.  ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కానీ, భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.  అయితే,  ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేదా ఎవరైన కావాలని చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.