రష్మిక మందన్న హీరోయిన్‌‌గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ

రష్మిక మందన్న హీరోయిన్‌‌గా ది గర్ల్  ఫ్రెండ్ మూవీ

రష్మిక మందన్న హీరోయిన్‌‌గా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌‌ను ఆదివారం ప్రకటించారు. ‘ది గర్ల్ ఫ్రెండ్‌‌’ అనే టైటిల్‌‌ను ఫైనల్ చేస్తూ, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ‘నేను తనను ఎంత ప్రేమిస్తున్నానంటే.. తనకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదురా.. నేను చాలు. 

24 గంటలు పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది..  నాది అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ప్చ్ ఆ కిక్కే వేరురా..’ అంటూ ఓ వాయిస్ వినిపిస్తోంది. అలాగే రష్మిక శ్వాసను ఆపి నీటి అడుగున ఉన్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ఖుషి’ ఫేమ్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.